గ్యాస్ట్రైటిస్ మరియు ఐ.బి.ఎస్ (IBS)ని నియంత్రించడం ఎలా?
గ్యాస్ట్రైటిస్
గ్యాస్ట్రైటిస్ (పొట్టలో పుండ్లు) మరియు ఐ.బి.ఎస్ (ప్రకోప ప్రేగు సిండ్రోమ్) అనేవి బహుశా అన్ని ఇతర జీర్ణ సంబంధ సమస్యల కంటే సాధారణంగా గుర్తించబడే అస్వస్థతలు. వాటికి సంబంధించిన అన్ని సమస్యలను నియంత్రించడానికి హోమియోపతిలో ఉత్తమ చికిత్స ఉంది.
గ్యాస్ట్రైటిస్ కారణాలు
కడుపు లోపల భాగంలో ఏర్పడే మంట మరియు బాధ వల్ల గ్యాస్ట్రైటిస్ ఏర్పడతాయి. ఈ కడుపు మంట అనేది నొప్పిని, కడుపు యొక్క పై భాగంలో మండే స్వభావాన్ని, గుండెల్లో మంట, త్రేన్పులు, ఆహారం యొక్క వాంతి, మరియు వికారం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. నొప్పి తగ్గించే మాత్రలు ఎక్కువ కాలం పాటు ఉపయోగించడం వల్ల, ఇన్ఫెక్షన్లు, పొగతాగడం, ఆల్కహాల్ మరియు కొన్ని ఆటోఇమ్యూన్ పరిస్థితుల కారణంగా గ్యాస్ట్రైటిస్ ఏర్పడుతుంది.
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్(IBS)
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్(ప్రకోప ప్రేగు సిండ్రోమ్) లేదా ఐబిఎస్ అనేది పెద్ద ప్రేగులను ప్రభావితం చేసే ఒక సాధారణ జీర్ణ సమస్య. జీర్ణశయాంతర నాళము అనునది ఆహరం ప్రయాణించే పూర్తి మార్గము అంటే నోరు, ఆహారనాళం, ఉదరం, చిన్న పేగు, మరియు పెద్ద పేగు, వీటికి సంబంధించిన అవయవాలు కాలేయం, పిత్తాశయం మరియు క్లోమం. ఇవి జీర్ణ సంబంధమైన ఎంజైమ్లను స్రవిస్తాయి. ఇందులో ఐ.బి.ఎస్ అనేది పెద్ద ప్రేగులో క్రమరహిత్యం వలన లేదా అసాధారణ కదలికల వలన వచ్చే సమస్య. ప్రేగుల సహజ కదలికలు కాకుండా అదనంగా జరిగే కదలికల వల్ల మలబద్ధకం లేదా అతిసారం లేదా రెండు ఏర్పడి చాలా అసౌకర్యం మరియు బాధను కలిగిస్తాయి. ఇది కడుపు ఉబ్బరం మరియు పొత్తి కడుపులో నొప్పిని కూడా కలిగిస్తుంది.
ఐబిఎస్ కి కారణాలు:
ఈ వ్యాధి ఏర్పడడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియదు. కానీ మానసిక ఒత్తిడి, గ్యాస్టిక్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల నూనె పదార్థాలు, మసాలాలు, కొవ్వు పదార్థాలు, కలుషితమైన నీరు లేదా ఆహారం మొదలైన వాటికి ప్రేగులు తీవ్ర సున్నితత్వం కలిగి ఉంటాయి. వీటి ప్రేరేపణ వల్ల ఐబిఎస్ వ్యాధి లక్షణాలు వస్తాయి. కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ మందుల వాడకం వల్ల కూడా మన శరీరంలోని మేలు చేసే బ్యాక్టీరియాకు హాని కల్గి ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
ఐబిఎస్ యొక్క లక్షణాలు:
పొత్తి కడుపు నొప్పి, తిమ్మిరి లేదా ఉబ్బరం, ప్రేగు కదలికలో మార్పులు, త్రేన్పులు, కడుపులో పూర్తిగా నిండి నట్లు ఉండే భావన, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం, మరియు అతిసారం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. మలవిసర్జన ద్వారా పొత్తి కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
సాధారణంగా వీటితో పాటు, ఐ.బి.ఎస్. తో బాధపడేవారు గ్యాస్ట్రైటిస్, హెమోరాయిడ్స్, మరియు మూత్రపిండాల రాళ్లు వంటి వాటి బారిన పడుతున్నారు.
గ్యాస్ట్రైటిస్ మరియు ఐ.బి.ఎస్ (IBS) సమస్యకు హోమియోపతి చికిత్స
హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో అందించే కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ఐబిఎస్ కి మరియు గ్యాస్ట్రైటిస్ కి చక్కని ప్రభావవంతమైన పరిష్కారం. ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఈ హోమియోపతి చికిత్సను నిపుణులైన మా హోమియోపతి వైద్యులు ఐబిఎస్ సమస్యలకు గల మూలకారణాన్ని విశ్లేషించి దాని నిర్మూలించడం ద్వారా వీటిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
గ్యాస్ట్రైటిస్ మరియు ఐ.బి.ఎస్ గురించి మరింత సమాచారం కోసం మా వెబ్‌సైట్ పేజీలు https://www.homeocare.in/homeopathy-gastritis-treatment.html మరియు https://www.homeocare.in/irritable-bowel-syndrome.html ని సందర్శించండి మరియు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.