మధుమేహనికి హోమియోపతి చికిత్స

మధుమేహాన్ని హోమియోపతి చికిత్సతో నియంత్రించ వచ్చా?

మధుమేహం(డయాబెటీస్) 

మధుమేహం అనేది దీర్ఘకాలిక జీవక్రియకి సంబంధించిన వ్యాధి. దీనినే చక్కర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ఇన్సులిన్ రక్తంలో చక్కెరను నియంత్రించే ముఖ్యమైన హార్మోన్. క్లోమము (ప్యాంక్రియాస్) అవసరమైన ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం మధుమేహంగా పరిగణించబడుతుంది.

మధుమేహం 4 రకాలుగా వర్గీకరించబడింది. అవి:

  1. టైప్ 1 డయాబెటిస్: ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థ, క్లోమ గ్రంథి లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేయడం వల్ల ఏర్పడే పరిస్తితి. మధుమేహం ఉన్నవారిలో దాదాపు 10% మంది ఈ రకమైన పరిస్థితిని కలిగి ఉంటారు.  ఖచ్చితమైన కారణాలు తెలియవు కానీ జన్యువుల కారణంగా మరియు వైరస్‌లకు గురికావడం వల్ల రావచ్చు.
  2. టైప్ 2 డయాబెటిస్: కణాలు రక్తంలో చక్కెరను సమర్థవంతంగా ఉపయోగించలేకపోవడం. శరీరం ఇన్సులిన్ వినియోగానికి నిరోధకతను కలిగి ఉండటం లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం  ఈ రకం డయాబెటిస్ యొక్క లక్షణాలు. జన్యుపరంగా, మారుతున్నజీవనశైలి కారణంగా, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, మరియు అధిక ఒత్తిడి మొదలగునవి కారణాలు కావచ్చు
  3. ప్రీడయాబెటిస్: రక్తంలో చక్కెర సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. కానీ ఇది మధుమేహం అని వర్గీకరించేంత ఎక్కువ కాదు. సరైన చర్యలు తీసుకుంటే దీని పురోగతిని నివారించవచ్చు.
  4. గర్భధారణ మధుమేహం: గర్భధారణ సమయంలో అధిక చక్కెర స్థాయిలు మరియు మాయ (ప్లసెంటా) ఉత్పత్తి చేసే హార్మోన్లు ఇన్సులిన్ ని నిరోధించడం వల్ల ఇది సంభవిస్తుంది. మాయ (ప్లసెంటా) నుండి ప్రతిఘటనను ఎదుర్కోవడానికి ప్యాంక్రియాస్ అదనపు ఇన్సులిన్ను ఉత్పత్తి చేసినప్పటికీ, కొన్నిసార్లు చాలా తక్కువ గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశిస్తుంది మరియు మిగిలినవి రక్తంలో ఉండి, గర్భధారణ మధుమేహానికి దారి తీస్తుంది. చాలా సందర్భాలలో, ఇది ప్రసవం తర్వాత నయం అవుతుంది.

మధుమేహం వల్ల ఏర్పడే అధిక రక్త చక్కెర స్థాయిలను నియంత్రించనట్లయితే, కళ్ళ నుండి కాళ్ళ దాకా ప్రతి అవయవన్ని దెబ్బతీస్తుంది అంటే గుండె, నరాలు, రక్త నాళాలు, కళ్ళు, మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. నియంత్రణ లేని మధుమేహం హైపర్ గ్లైసీమియాకి దారి తీస్తుంది. వివిధ రకాల మధుమేహానికి లక్షణాలు, కారణాలు మరియు చికిత్స వేరువేరుగా ఉంటాయి.

మధుమేహం సాధారణ లక్షణాలు:

  • కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు మరియు మంటలు కలగడం
  • దాహం పెరగడం
  • తరచుగా మూత్ర విసర్జన
  • విపరీతమైన ఆకలి
  • అకస్మాత్తుగా బరువు తగ్గడం
  • మూత్రంలో కీటోన్ల ఉనికి
  • అలసట
  • చిరాకు
  • చూపు మందగించటం
  • గాయాలు తొందరగా నయం కాక పోవడం
  • తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు
  • చిగుళ్ళు లేదా చర్మ ఇన్ఫెక్షన్లు 
  • యోని ఇన్ఫెక్షన్ల 

మధుమేహనికి హోమియోపతి చికిత్స

మధుమేహాం ఏ రకమైన హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోని కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో, సమర్థవంతమైన ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, మరియు కణాలలో ఇన్సులిన్ వినియోగాన్ని ప్రేరేపించడంలో ప్రభావవంతమైనది, చాలా సురక్షితమైనది మరియు ఎలాంటి దుష్ప్రభావాలు చూపనిది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో నిపుణులైన వైద్యులు ప్రస్తుత మరియు గత లక్షణాలు, కుటుంబ చరిత్ర ఆధారంగా మధుమేహానికి అధునాతన వ్యక్తిగతికరించిన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స అందిస్తారు. ఇది కేవలం వ్యాధి లక్షణాలకు మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మధుమేహం వల్ల కలిగే అన్ని సమస్యలను నివారిస్తుంది. అల్లోపతి చికిత్సతో పాటు హోమియోపతి చికిత్స తీసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండదు. మధుమేహం చికిత్స గురించి మరింత సమాచారం కోసం మా వెబ్ సైట్ ని   https://www.homeocare.in/diabetes-treatment.html సందర్శించండి  లేదా మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202  కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

మధుమేహనికి హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version