సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

సంతానలేమి: సంతానలేమి అనేది మగ లేదా ఆడ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క అనారోగ్య స్థితి. ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా అసురక్షిత సంభోగం చేసిన తర్వాత కూడా ఒక జంట గర్భం దాల్చలేకపోవడమే సంతానలేమిగా పరిగణించబడుతుంది. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల సంతానలేమి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గర్భం దాల్చడానికి ప్రయత్నించటం అనేది మరింత ఒత్తిడితో కూడిన మరియు బాధాకరమైన జీవితం. ఇది దంపతుల్లో మరింత శారీరక మరియు మానసిక అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది.

సంతానం కలగకపోవడానికి స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా ఒక్కరే కారణమని చెప్పలేము. తాజా అధ్యయనంలో, సంతానలేమి కి సంబంధించిన కేసుల్లో 50% కేసులు మహిళల్లో సమస్యల కారణంగా, 45% కేసులు పురుషులలో సమస్యల కారణంగా మరియు మిగిలిన 5% కేసులు తెలియని కారణాల వల్ల సంతానలేమికి గురవుతున్నయని తేలింది.

ఈ సంతానలేమిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు.

ప్రథమ సంతానలేమి : ప్రథమ సంతానలేమి అంటే ఏ విధమైన గర్భనిరోధక సాధనాలు ఉపయోగించకుండా ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా సంభోగంలో పాల్గొన్న తర్వాత కూడా దంపతులకు గర్భం దాల్చలేకపోవడం,

ద్వితీయ సంతానలేమి : ద్వితీయ సంతానలేమి అంటే ఒక జంట వారి మొదటి బిడ్డను కలిగి ఉండటం లేదా గర్భస్రావం జరిగి రెండవసారి గర్భం దాల్చడానికి సమస్యలను ఎదుర్కొంటుండటం.

ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన హోమియోపతి చికిత్సలతో, సంతానలేమి సమస్యలను సమర్థవంతంగా ఎదురుకోవచ్చు.

సంతానలేమికి కారణాలు:  

పురుషులలో సంతానలేమికి సంబంధించిన కారణాలు

 • గనేరియా వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDలు)
 • జన్యుపరమైన సమస్యలు
 • HIV/AIDS
 • గవదబిళ్ళలు (Mumps)
 • వెరికోసెల్

పురుషులలో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ఇతర కారణాలు

 • శీఘ్ర స్కలనం, వృషణాల గాయాలు మరియు వాటిలో అడ్డంకులు,
 • కొన్ని రకాల యాంటీ-బయాటిక్స్ వాడకం,
 • ప్రోస్టేటిస్,
 • ఆర్కిటిస్ 
 • ఎజక్యూలేటరీ డక్ట్ అబ్ స్ర్టక్షన్.

స్త్రీల సంతానలేమికి సంబంధించిన కారణాలు:

 • నెలసరి సమస్యలు (మెన్ స్ట్రూవల్ డిసడర్స్)
 • అండోత్సర్గము రుగ్మతలు (ఒవ్యులేషన్ డిసడర్స్)
 • PCOS
 • హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం
 • FSH (ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్)
 • LH (ల్యూటినైజింగ్ హార్మోన్) 
 • ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ల రుగ్మతలు
 • గర్భాశయం లేదా గర్భాశయ ఇతర సమస్యలు
 • ఫెలోపియన్ ట్యూబ్స్ లో అడ్డంకులు, లేదా అవి దెబ్బతినడం వంటి సమస్యలు 
 • ఎండోమెట్రియోసిస్

స్త్రీల సంతానలేమికి ఇతర కారకాలు.

 •  ఊబకాయం
 • మానసిక ఒత్తిడి
 • ధూమపానం
 • మద్యం సేవించడం
 • రేడియేషన్‌కు గురికావడం

మధుమేహం మరియు కొన్నిరకాల మందుల వాడకం వంటి కారణాలు  స్త్రీ , పురుషులు ఇద్దరికి వర్తిస్తాయి.

సంతానలేమి లక్షణాలు:

మగవారిలో సంతానలేమి లక్షణాలు:

 • లైంగిక కోరికలో మార్పులు
 • వృషణాలలో నొప్పి లేదా గడ్డ
 • చిన్న లేదా దృఢమైన వృషణాలు
 • స్కలనం (ఎజక్యూలేషన్) మరియు అంగస్తంభన (ఎరెక్షన్)

స్త్రీలలో ​సంతానలేమి లక్షణాలు:

 • క్రమరహిత పీరియడ్స్
 • సెక్స్ సమయంలో నొప్పి
 • ఒవ్యులేషన్ సమస్యలు
 • చర్మం లో మార్పులు,
 • లైంగిక కోరికలో మార్పులు
 • బరువు పెరగడం
 • అవాంఛిత రోమాలు

సంతానలేమికి కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స

హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోని నిపుణులైన డాక్టర్లు, వ్యక్తి యొక్క సమగ్ర విశ్లేషణ అనగా గత మరియు ప్రస్తుత లక్షణాలు, జెనెటిక్స్ మరియు ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా సూచించే కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స సంతానలేమి సమస్యకి గల మూలకారణం కనుక్కొని దానిని సరిచేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది మరియు మగవారిలో స్పెర్మ్ కౌంట్ మరియు స్పెర్మ్ మొబిలిటీ మెరుగుపడేలా చేస్తుంది. అడవారి ఒవ్యులేషన్ క్రమబద్ధం అయ్యేలా చేస్తుంది. మరియు ముఖ్యంగా ఇది భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడానికి, ఒత్తిడి, నిరాశ మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

సంతానలేమి విషయంలో ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా ఒకదానితో మరొకటి కలిసి సంతానలేమికి కారణం అవుతాయి. అటువంటి మూలకారణాలతోపాటు, సంతానలేమికి గల ఇతర కారణాలను కాన్స్టిట్యూషనల్ హోమియోపతి పద్ధతిలో క్షుణ్ణంగా విశ్లేషంచటం ద్వారా పరిపూర్ణమైన, ఎటువంటి దుష్ఫలితాలు లేని చికిత్స చేస్తారు. సంతానలేమి సమస్య మరియు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స గురించి మరింత సమాచారం కోసం దయచేసి మా వెబ్ సైట్ ని https://www.homeocare.in/infertility.html సందర్శించండి  లేదా మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202  కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version