పురుషులలో సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

పురుషులలో సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

ఒక సంవత్సరంపాటు ఎటువంటి కాంట్రాసెప్టివ్స్ వాడకుండా సంభోగంలో పాల్గొన్న తర్వాత కూడా మగ భాగస్వామి తన జీవిత భాగస్వామిని గర్భం దాల్చేలచేయలేనప్పుడు పురుష సంతానలేమి గా పరిగణిస్తారు.

ఇటీవలి WHO నివేదిక ప్రకారం, 20 నుండి 30% జంటలు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అందులో 50% కేసుల్లో పురుషుల సమస్యలే సంతానలేమికి కారణమయ్యాయి. ఈ సమస్యలు ప్రధానంగా వీర్యానికి సంబంధించినవి. మగ మరియు ఆడవారిలో సంతానలేమికి వివిధ కారణాలు ఉండవచ్చు అందులో పురుషుల సంతానలేమి కి సంబంధించిన మూడింట ఒక వంతు కంటే ఎక్కువ సందర్భాల్లో, స్పెర్మ్ కౌంట్ సమస్యలు, చలనశీలత, అసాధారణ స్పెర్మ్ పనితీరు లేదా స్పెర్మ్ కదలికను నిరోధించే అడ్డంకులు కారణం అవుతున్నాయి.

మగవారిలో ​సంతానలేమికి దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు, అసహజ జీవనశైలి మరియు గతంలో జరిగిన ప్రమాదాలు మొదలైనవి ఇతర ​కారణాలు. విషపూరిత ​వాతావరణాలకు గురికావడం కూడా పునరుత్పత్తిని మరియు శుక్రకణాల (స్పెర్మ్) నాణ్యతను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఒక్క సంతానం కూడా లేని దంపతులు ​మరింత ఒత్తిడికి గురవుతారు.

పురుషుల్లో సంతానలేమి కి కారణాలు

పురుషుల్లో సంతాన లేమి సమస్యకు ముఖ్యకారణం వీర్యకణాల లోపాలే – పురుషులలో వీర్యంలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, వీర్య కణాలు పూర్తిగా లేకపోవడం, వీర్య కణాలలో కదలికలు తగ్గడం, వీర్యకణాల స్వరూపం సరిగా లేకపోవడం మొదలైన లోపాలు.

మగవారిలో సంతానలేమి కి నాలుగు ప్రధాన కారణాలు:

1.  స్పెర్మ్ డిజార్డర్స్: A)అజూస్పెర్మియా అనేది పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అనారోగ్య పరిస్థితి, ఇందులో వీర్యకణాల సంఖ్య పూర్తిగా లేకపోవడం జరుగుతుంది. వృషణాలు పనిచేయకపోవడం, క్యాన్సర్ కీమోథెరపీ లేదా ఎపిడిడిమిస్ లేదా వాసెక్టమీ వల్ల ట్యూబ్లలో అడ్డంకి కారణంగా ఇది సంభవించవచ్చు.

B) ఒలిగోస్పెర్మియా అనేది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే పరిస్థితి, ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వీర్యంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఇది గర్భధారణ సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది.

C) స్పెర్మ్ యొక్క పేలవమైన చలనశీలత,

D) అసాధారణ నిర్మాణం, స్పెర్మ్ పూర్తిగా పెరగకపోవడం

2.  వెరికోసెల్స్: ఇది స్క్రోటమ్ లోపల సిరల వాపుకి సంబంధించిన సమస్య. దీని ఫలితంగా తగినంత రక్త ప్రసరణ జరగక స్పెర్మ్ అభివృద్ధి దెబ్బతింటుంది. వెరికోసెల్స్ కడుపు నుండి స్క్రోటమ్‌కు రక్త ప్రవాహం జరగకుండా చేయడం వల్ల స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసే వృషణాలలో వేడి పెరుగుతుంది. అది స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుంది.

3.  రెట్రోగ్రేడ్ ఎజక్యూలేషన్ (తిరోగమన స్కలనం): ఈ సందర్భంలో, ​మూత్రాశయం మూసుకోనప్పుడు వీర్యం శరీరంలోకి తిరిగి ప్రవహిస్తుంది.కాబట్టి స్పెర్మ్ వీర్యంలో ఉండిపోయి యోనిని చేరుకోదు.

4.  హార్మోన్ల అసమతుల్యత: క్రోమోజోమ్ లేదా హార్మోన్ సమస్యలు, తక్కువ టెస్టోస్టెరాన్ మరియు థైరాయిడ్ సమస్యల వంటివి స్పెర్మ్ గణన తక్కువ కావడానికి ఇతర కారణాలు. వీటివల్ల పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని అసంపూర్ణంగా ఏర్పడిన స్పెర్మ్ లేదా అసలు స్పెర్మ్ ఏర్పడకపోవడం జరగవచ్చు.

ఇవే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD) మరియు క్యాన్సర్ సంబంధిత రేడియేషన్ థెరపీ చికిత్సలు అనేవి చాలా సాధారణమైన ఇతర కారణాలు.

సంతానలేమికి ప్రత్యేక లక్షణాలు ఉండవు. వీర్య పరీక్ష మరియు వృషణాల పరీక్ష ద్వారా సంతానలేమి సమస్యను గుర్తించవచ్చు.

పురుషులలో సంతానలేమికి హోమియోపతి చికిత్స

హోమియోకేర్ ఇంటర్నేషనల్లోని నిపుణులైన హోమియోపతి వైద్యులు రోగి యొక్క లక్షణాలు, జన్యుశాస్త్రం, ఆరోగ్య పరిస్థితులు మరియు జీవనశైలి యొక్క లోతైన విశ్లేషణతో పురుషుల సంతానలేమి సమస్యలకు చికిత్స చేస్తారు. సమస్య యొక్క మూల కారణాన్ని అర్థం చేసుకున్న తర్వాత, స్పెర్మ్ కౌంట్, చలనశీలత మరియు రోగి యొక్క మొత్తం ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం వంటి ఉత్తమ ఫలితాలను పొందడానికి చికిత్స సూచిస్తారు.

స్త్రీ మరియు పురుషులలో సంతానలేమికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి చికిత్స గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202  కాల్ చేయండి లేదా వెబ్ సైట్ ని సందర్శించండి.

పురుషులలో సంతానలేమి(ఇన్పెర్టిలిటీ)కి హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version