కిడ్నీలో రాళ్లకు హోమియోపతి చికిత్స

మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీలో రాళ్లు)

మూత్ర వ్యవస్థ మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం, మూత్రప్రసేకం తదితర భాగాలతో నిర్మితమవుతుంది. మూత్రపిండాలు రక్తంలోని అదనపు నీటిని, వ్యర్థాలను వడపోస్తాయి మరియు రక్తంలో ఉండే లవణాలకు, ఇతర పదార్థాలకు మధ్య సమతుల్యతను కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి.

మూత్రంలో సహజంగా ఉండే కొన్ని జీవరసాయన పదార్థాలు మూత్రపిండాలలో రాళ్లు(కిడ్నీలో రాళ్లు) తయారవ్వకుండా చేస్తాయి. ఒకవేళ ఈ పదార్థాలు లోపిస్తే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యే ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో ‘యూరోలిథియాసిస్’ అని అంటారు. ఆ రాళ్ళు కిడ్నీలో తయారయినప్పటికి, మూత్ర నాళల వరకు ప్రయాణిస్తాయి. ఒకవేళ అవి చిన్న పరిమాణంలో ఉంటే, నొప్పి లేకుండా మూత్రం రూపంలో బయటకు పోతాయి, కానీ అవి గనక పెద్దవిగా ఉంటే, మూత్రనాళాలలో కూరుకుపోయి మూత్ర ప్రవాహాన్ని నిరోధించి నొప్పిని కలిగిస్తాయి.

స్ర్తీల కంటే పురుషులు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు కాని మారుతున్న జీవనశైలి కారణంగా ఈ తేడా అనేది తగ్గిపోతుంది. యువకుల్లో మరియు వయసు పైబడిన వారిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. అందుకు కారణం మూత్రాశయం నుండి మూత్రం సరిగా బయటకు పోకుండా రాళ్లు అడ్డు పడటం వల్ల అక్కడ మూత్ర నిల్వ చేరి బ్యాక్టీరియా చేరుతుంది. ఇది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

కిడ్నీలో రాళ్లకు హోమియోపతి చికిత్స

మూత్రపిండాల రాళ్లలో రకాలు:

 1. కాల్షియం రాళ్ళు: చాలావరకు ఈ కాల్షియం రాళ్ళు కాల్షియం ఆక్సలేట్ నుండి తయారవుతాయి. వివిధ ఆహార కారకాలతో పాటు, అదనపు విటమిన్ డి, పేగు బైపాస్ సర్జరీ మరియు ఇతర జీవక్రియ సమస్యలు మూత్రంలో కాల్షియం ఆక్సలేట్ గాఢతను పెంచవచ్చు. కాల్షియం రాళ్ళు కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో కూడా సంభవించవచ్చు.
 2. స్ట్రువైట్ రాళ్ళు: ఈ రాళ్ళు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కు ప్రతిస్పందనగా ఏర్పడతాయి. ఈ రాళ్ళు త్వరగా మరియు పెద్దవిగా ఏర్పడతాయి. అయితే ఇవి ఎటువంటి లక్షణాలను కల్గ చేయవు. ఒకవేళ కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ తక్కువ తీవ్రత కల్గి ఉంటాయి.
 3. యూరిక్ యాసిడ్ రాళ్ళు: తగినంత ద్రవపదార్థాలు తీసుకోనివారిలో, ఎక్కువ ద్రవాన్ని కోల్పోయేవారిలో, అధిక ప్రొటీన్ ఆహారం తీసుకునేవారిలో, గౌట్ ఉన్నవారిలో, మధుమేహం లేదా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఇవి ఏర్పడతాయి. కొన్ని జన్యుపరమైన కారకాలు కూడా యూరిక్ యాసిడ్ రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
 4. సిస్టీన్ రాళ్ళు: సిస్టినూరియా అనే వంశపారంపర్య వ్యాధి వలన మూత్రపిండాలు అమైనో ఆమ్లాన్ని (సిస్టీన్) ఎక్కువగా విసర్జించేలా చేస్తాయి. ఈ వ్యాధి ఉన్నవారిలో అమైనో ఆమ్లం ఎక్కువగా పోగవడం వల్ల రాళ్లు ఏర్పడతాయి

మూత్రపిండాల రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు :

 • శరీరంలో నీరు శాతం తగ్గిపోవడం (డీహైడ్రేషన్)
 • జన్యుపరమైన సమస్యలు
 • ఉప్పుకాల్షియం మరియు యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం
 • ఊబకాయం,
 • గౌట్, హై బిపి, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, మరియు మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు,
 • కొన్నిరకాల మందుల వాడకం 

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లు తెలిపే లక్షణాలు:

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లు తెలిపే లక్షణాలు ఆ రాళ్ళ సైజును బట్టి తెలుస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్ళ చిన్నసైజులో ఉంటే వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. మూత్రంలో బయటకు వచ్చేస్తుంది. అదే పెద్ద సైజు రాళ్ళు ఉన్నట్లైతే మూత్రాశయం నుండి కిడ్నీల నుండి బ్లాడర్ కు మూత్రం చేరే మార్గంను అడ్డుకుంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటారు

 • మూత్రంలో రక్తం లేదా మూత్రం రంగు ఎరుపు, గులాబి లేక గోధుమ రంగులోకి మారటం,
 • వాంతులు మరియు వికారం,
 • ఇన్ఫెక్షన్ ఉంటే చలి లేదా జ్వరం రావటం,
 • ప్రక్కటెముకల క్రింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి,
 • పొట్ట క్రింది భాగంలో మరియు గజ్జల ప్రాంతంలో నొప్పి,
 • మూత్రవిసర్జనలో నొప్పి,
 • నిరంతరంగా మూత్ర విసర్జన చేయవలసి రావటం,
 • చిక్కటి లేదా దుర్వాసనతో కూడిన మూత్రం 

కిడ్నీలో రాళ్లకు (మూత్రపిండాల్లో రాళ్లకు) హోమియోపతి చికిత్స:

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకి హోమియోపతి చికిత్స ఎంతో సురక్షితమైనది, ప్రభావవంతమైనది మరియు శస్త్రచికిత్సతో పని లేకుండా సమస్యను దూరం చేస్తుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స ద్వారా నొప్పి మరియు అసౌకర్యాన్ని నియంత్రించడమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి మూత్రంతో పాటు బయటకు పంపడంలో సహాయపడుతుంది. మూలకారణాలను నిర్మూలించడం ద్వారా కిడ్నీలో రాళ్లను శాశ్వతంగా దూరం చేయడంతోపాటు వాటిని మళ్ళీ రాకుండా చేయడంలో ఈ చికిత్స ఎంతగానో దోహదపడుతుంది. ఈ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స వ్యక్తిగత లక్షణాల ఆధారంగా సూచించబడటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలను కలగచేయకుండా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది.

మరింత సమాచారం కోసం దయచేసి మా వెబ్‌సైట్‌  https://www.homeocare.in/homeopathy-kidneystones-treatment.html  పేజీని సందర్శించండి మరియు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

కిడ్నీలో రాళ్లకు (మూత్రపిండాల్లో రాళ్లకు) హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *