శీఘ్ర స్ఖలనం సమస్యలకు మెరుగైన హోమియోపతి చికిత్స
శీఘ్ర స్ఖలనం
శీఘ్ర స్ఖలనం అనేది వ్యక్తి సంభోగ సమయంలో అతను లేదా అతని భాగస్వామి కోరుకునే దానికంటే చాలా త్వరగా స్కలనం జరిగిపోయే ఒక లైంగిక అసమర్థత. ఇలా ఫోర్‌ప్లే సమయంలో లేదా చొచ్చుకుపోయిన వెంటనే జరిగితే లైంగిక అసంతృప్తికి దారితీస్తుంది మరియు ఇది జంటలో ఒకరు లేదా ఇద్దరు భాగస్వాములకు బాధ కలిగించవచ్చు. స్కలనాన్ని ఆలస్యం చేయడంలో ఈ అసమర్థత పురుషులలో ఆత్మవిశ్వాసం తగ్గేలా చేయటమే కాక ఒత్తిడి, నిరాశ మరియు ఇబ్బందికి గురిచేస్తుంది.
శీఘ్ర స్ఖలనాన్ని ప్రాథమిక మరియు ద్వితీయంగా వర్గీకరించవచ్చు. ప్రైమరీ శీఘ్ర స్ఖలనం మొదటి సారి నుండి వారి జీవితాంతం అన్ని లేదా దాదాపు అన్ని సార్లు సంభవిస్తుంది. సెకండరీ లేదా పొందిన శీఘ్ర స్ఖలనం గతంలో మెరుగైన లైంగిక అనుభవం తర్వాత అభివృద్ధి చెందుతుంది.
శీఘ్ర స్కలనం అనేది దంపతుల మధ్య ఒక సాధారణ లైంగిక ఫిర్యాదు మరియు ప్రతి 3 మంది పురుషులలో ఒకరు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. ఇది చాలా అరుదుగా జరిగేంత వరకు ఆందోళనకు కారణం కాదు. కానీ ఒక వ్యక్తి ప్రతిసారీ లేదా చాలా తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటు, దాని కారణంగా బాధను అనుభవిస్తే మరియు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, సంతానోత్పత్తి సమస్యలు మరియు జీవిత భాగస్వామితో సంబంధ సమస్యలతో సతమతవుతుంటే, అది ఆందోళన పడవలసిన మరియు తప్పక చికిత్స తీసుకొవలసిన సమస్య.
శీఘ్ర స్కలనానికి కారణాలు:
జీవసంబంధమైన మరియు మానసిక కారకాలు మరియు వాటి సంక్లిష్ట పరస్పర చర్య రెండూ శీఘ్ర స్ఖలనంలో పాత్రను పోషిస్తాయి మరియు ఇది ఒక సాధారణ మరియు చికిత్స చేయగల పరిస్థితి. జీవసంబంధ కారకాలైన హార్మోన్ల అసమతుల్యత, న్యూరోట్రాన్స్మిటర్లు అని పిలువబడే మెదడు రసాయనాలలో అసమతుల్యత, ప్రోస్టేట్ లేదా మూత్రనాళం యొక్క వాపు మరియు కుటుంబం యొక్క వారసత్వ లక్షణాలు.
కొన్నిసార్లు గతంలోని బాధాకరమైన లైంగిక అనుభవాలు కూడా శీఘ్ర స్ఖలనానికి కారణం కావచ్చు. మానసిక కారకాలు ఒత్తిడి, ఆందోళన, తక్కువ ఆత్మగౌరవం, నిరాశ మరియు లైంగిక అనుభవం కావచ్చు. శీఘ్ర స్కలనానికి మధుమేహం, ప్రోస్టేట్ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు, అధిక మద్యపానం మరియు కొన్ని ఔషధ ప్రతిచర్యలు ఇతర సాధారణ కారణాలు. శీఘ్ర స్ఖలనంతో సంబంధం ఉన్న ప్రమాదాలు అంగస్తంభన మరియు విపరీతమైన ఒత్తిడి.
శీఘ్ర స్కలనం సమస్య లక్షణాలు: తక్కువ లైంగిక ప్రేరణతో మరియు తక్కువ నియంత్రణతో స్కలనం జరుగుతుండటం, స్కలనంపై నియంత్రణ సరిగా లేనందున లైంగిక ఆనందం తగ్గిపోవడం, అపరాధ భావనలు, ఇబ్బంది, లేదా నిరాశ అనేవి శీఘ్ర స్కలనం యొక్క లక్షణాలు.
చికిత్స నుండి వేగవంతమైన ఫలితాలను పొందడానికి కొన్ని ఆహార మార్పులు మరియు శారీరక వ్యాయామాలను వైద్యులు సూచిస్తున్నారు. హోమియోపతి చికిత్స చేయించుకుంటున్న వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. గాలితో కూడిన సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి మరియు అతను ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. కెఫిన్ వినియోగాన్ని తగ్గించాలి మరియు ఎయిర్ కండీషనర్‌లను ఉపయోగించి కృత్రిమ ఉష్ణోగ్రత మార్పులకు దూరంగా ఉండాలి.
శీఘ్ర స్కలనం సమస్యకు హోమియోపతి చికిత్స
అంగస్తంభన మరియు శీఘ్ర స్కలనం వంటి సమస్యలతో బాధపడేవారికి హోమియోపతి చికిత్స ఒక వరం లాంటిది. వివిధ అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు మరియు విభిన్న మానసిక పరిస్థితుల కారణంగా ఏర్పడే ఈ సమస్యలకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనది మరియు దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు లేనిది. మా నిపుణులైన హోమియోపతి వైద్యులు అంగస్తంభన మరియు శీఘ్ర స్కలనం వంటి పురుష సంబంధిత అన్ని సమస్యలకు మూలకారణాన్ని విశ్లేషించి దాని నిర్మూలనకు తగిన కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స చేస్తారు.
మరింత సమాచారం కోసం మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.