పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు హోమియోపతి చికిత్స

పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు హోమియోపతి చికిత్స

ఈమధ్య కాలంలో చాలామంది మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు.  ఈ సమస్యలకు ప్రధాన కారణం ‘‘మొలలు (పైల్స్) లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ వంటివి కావడం సర్వసాధారణం. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు మరింత తీవ్రతరం అయి నాణ్యమైన జీవితానికి అంతరయంగా మారుతున్నాయి.

పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు హోమియోపతి చికిత్స

మొలలు (పైల్స్)

మలద్వారం లోపల ఉండే సున్నితమైన రక్త నాళాలు ఒత్తిడి మరియు వాపునకు గురి అయి, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కలగటాన్ని  మొలలు (పైల్స్) అంటారు. వైద్య పరిభాషలో దీన్ని హేమోరాయిడ్స్గా పరిగణిస్తారు.

మొలలు రకాలు:

మొలలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి మరియు అవి అంతర్గతంగా కాని బాహ్యంగా కాని ఉంటాయి

  1.     అంతర్గత ఆర్షమొలలు: ఇవి పురీషనాళం లోపల లోతుగా ఉంటాయి కాబట్టి కనిపించవు మరియు అక్కడ నొప్పి కలిగించే నరాలు ఉండవు కాబట్టి ఎక్కువ నొప్పిని అనిపించవు. కానీ మలద్వారం నుండి పొడుచుకు వచ్చిన  కణజాలం బాధాకరంగా ఉండి, మలంలో రక్తం రావడం గమనించవచ్చు.
  2.     బాహ్య ఆర్షమొలలు: ఇవి పాయువు చుట్టూ ఉన్న చర్మం క్రింద చాలా నొప్పి కలిగించే నరాలు ఉంచాయి. అవి అధిక రక్తస్రావాన్ని కలిగించి, నొప్పి, వాపు మరియు దురదకు కారణమవుతాయి.

పైల్స్‌కి కారణాలు:

  • దీర్ఘకాలిక అతిసారం లేదా మలబద్ధకం కలిగి ఉండటం
  • మలబద్ధకం వల్ల ప్రేగు కదలికల సమయంలో ఒత్తిడి ఏర్పడటం
  • ఊబకాయం
  • గర్భవతిగా ఉండటం
  • ఎల్లప్పుడు అధికంగా బరువులెత్తే పని చేయడం

వీటితో పాటు కాలేయ(లివర్) సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

మొలల యొక్క లక్షణాలు

పైన తెలిపిన కారణాల వలన మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం అవుతుంది. కొన్నిసార్లు శ్లేష్మ స్రావం, మలద్వారం దగ్గర గడ్డలు, వాపు మరియు ఆసన దురద వస్తాయి.

 ఫిషర్స్

మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది.

కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా, అతిగా మద్యం తీసుకోవడం, ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం, మాంసాహారం తరచుగా తినడం వల్ల, గర్భధారణ సమయంలో ఫిషర్స్ ఏర్పడవచ్చు. క్రోన్స్ వ్యాధి, పెద్దపేగు వాపు వంటి జబ్బులతో బాధపడే వారిలో ఫిషర్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంటతో, విరేచనంలో రక్తం పడుతుంటుంది. కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట అలాగే ఉంటుంది.

ఫిస్టులా

ఆనల్ ఫిస్టులా అనేది అసాధారణమైన చిన్నపుండు. ఇది పెద్దపేగు మరియు మలద్వార చర్మం మధ్య ఏర్పడుతుంది. దీనిని భగంధరం” వ్యాధి అని కూడా అంటారు. ఫిస్టులా అన్నది ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే సమస్య. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వస్తుంది.

ఫిస్టులా కారణాలు:

ఊబకాయం, గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో, ఊక్రాన్స్ డిసీజ్ లేదా పెద్దపేగు వాపు వ్యాధితో బాధపడే వారిలో ఈ సమస్య వస్తుంది. తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో ఒకవేళ ముందుగానే ఫిస్టులా సమస్యగనక ఉంటే, అది మరింత తీవ్రమవుతుంది.

ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని ఉన్నవారికి ఈ వ్యాధి వస్తుంది. ఫిస్టులా ఒక్కొక్కసారి మలద్వారంలోకి తెరచుకోవడం వలన ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ అనో అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది.

ఫిస్టులా లక్షణాలు:

రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన, చర్మం పైన చిన్న మొటిమలాగా నొప్పి, వాపుతో ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది.  దీనిమూలంగా తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి, నెలకి మళ్ళీ తిరిగివస్తూ, సాధారణ జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు

సిబిపి, ఇఎస్‌ఆర్,  ఫిస్టులోగ్రమ్, ఎమ్మారై, సీటీస్కాన్ మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా ఈ తరహ తీవ్రమైన వ్యాధులను, వాటి తీవ్రతను గుర్తించవచ్చు.

 హోమియో కేర్‌ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స

హోమియోకేర్ ఇంటర్ నేషనల్ కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్‌మెంట్ ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్దకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ లోని నిపుణులైన వైద్యులు, రోగి యొక్క మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని సంపూర్ణంగా నయం చేయగలిగే చికిత్స చేస్తారు.

చికిత్సతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలు

  •  సరైన పోషకాహారం తీసుకోవడం
  •  ఆహారంలో పీచు (ఫైబర్) పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం 
  •  మాంసాహారం తక్కువగా తినడం
  •  మలవిసర్జన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవడం
  •  సరైన వ్యాయామం చేయడం
  •  ఊబకాయం రాకుండా చూసుకోవడం.

మరింత సమాచారం కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ https://www.homeocare.in/ ని సందర్శించండి మరియు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *