స్పాండిలోసిస్ కి హోమియోపతి చికిత్స

స్పాండిలోసిస్ ని హోమియోపతి చికిత్సతో దూరం చేయవచ్చు

స్పాండిలోసిస్

స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ అనే పదాలు చాలా మందిని అయోమయం చేస్తాయి. స్పాండిలైటిస్ అనేది మెడ నొప్పికి సంబంధించినదిగా పరిగణించవచ్చు. మెడనొప్పి తీవ్రం అవటంతో పాటు తల తిరగడం, తూలి పడిపోతున్నామనే భావన కలగడం దీని లక్షణాలు. ఈ వ్యాధిని నివారించాలంటే మీరు కూర్చునే ప్రదేశం సరిగ్గా, సౌకర్యవంతమైన సిట్టింగ్ పొజిషన్ కల్గి ఉండాలి. దీనివల్ల ఈ సమస్యను చాలా వరకు నియంత్రణలో ఉంచవచ్చు. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ రెండూ ఒకేలా ఉంటాయి కానీ లక్షణాలు మాత్రం భిన్నంగా ఉంటాయి.  

స్పాండిలైటిస్ అనేది కీళ్లు, మరియు ఇతర మృదు కణజాలాలకు వ్యతిరేకంగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ వల్ల కలిగే దీనస్థితి.

స్పాండిలోసిస్ లేదా స్పైనల్ ఆర్థరైటిస్ అనేది వయస్సుతో పాటు వచ్చే అనారోగ్యం. ఇది వెన్నెముక క్షీణించే మార్పులైన దృఢత్వం మరియు నొప్పికి కారణమవుతుంది.

జన్యు కారకాలు, జీవనశైలి, వయస్సు కారకాలు, పోషకాహార లోపం, గతంలో అయిన గాయాలు మరియు ఇతర కారకాలు మరియు ఇది మెడ, వెన్ను పైభాగం, దిగువ వెన్ను మరియు ఇతర వెన్నెముక యొక్క ఏదైనా భాగానికి సంభవించవచ్చు. ఇది పూర్తిగా అభివృద్ధి చెందనంత వరకు, ప్రారంభ దశలో గుర్తించబడదు మరియు కొన్నిసార్లు నొప్పిని కూడా కలిగించదు.

 

వెన్నెముక ప్రభావితమైన భాగం ఆధారంగా స్పాండిలోసిస్ రకాలు:

  1. సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అత్యంత సాధారణ స్పాండిలోసిస్, ఇది వయస్సు పెరిగే కొద్దీ మెడపై ప్రభావం చూపుతుంది.
  2. థొరాసిక్ స్పాండిలోసిస్ వెన్నెముక యొక్క పై లేదా మధ్య భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చేతులు, కాళ్లు మరియు పాదాల్లో నొప్పి మరియు దృఢత్వానికి దారితీస్తుంది.
  3. లంబార్ స్పాండిలోసిస్ దిగువ వెన్నుపై ప్రభావం చూపుతుంది. ఈ రకమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు వెన్నెముకలో కదలిక కోల్పోవడం, నడక సమయంలో, నిలబడ్డప్పుడు మరియు కూర్చునేటప్పుడు అంటే దాదాపు అన్ని నిత్యకృత్యాలు చేసుకోవడంలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
  4. మల్టీలెవల్ స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన ఒక భాగం కంటే ఎక్కువ భాగాల్ని ప్రభావితం చేస్తుంది. ఈ రకమైన స్పాండిలోసిస్ తో బాధపడుతున్న వ్యక్తులలో మెడ, చేతులు మరియు కాళ్లలో తీవ్రమైన నొప్పి, సమతుల్యత కోల్పోవడం మరియు కండరాల బలహీనత మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

స్పాండిలోసిస్ యొక్క ప్రభావాలు అందరికి ఒకేలా ఉండవు మరియు తీవ్రమైన సమస్యలను కలిగించవు. కాని నొప్పి మరియు దృఢత్వం వల్ల జీవన విధానంలో నాణ్యత ఉండదు. సర్వైకల్ మరియు లంబార్ స్పాండిలోసిస్ చాలామంది లోనవుతున్నసాధారణ రకాలు. వీటి నొప్పి మరియు దృఢత్వాన్ని నియంత్రించి, విశ్రాంతిని ఇచ్చే మెరుగైన చికిత్స హోమియోపతి చికిత్స.

స్పాండిలోసిస్ కి  కారణాలు:

  • జన్యు కారకాలు
  • పెరిగే వయస్సు
  • పుట్టుకతో వచ్చే వెన్నెముక అసాధారణతలు
  • హెర్నినేటెడ్ డిస్క్
  • ఊబకాయం
  • గతంలో అయిన గాయాలు
  • శారీరక క్రియాహీనత లేదా పునరావృత కదలికలు
  • పోషకాహార లోపం
  • ధూమపానం
  • కూర్చునే మరియు నిలబడేపద్దతి సరిగ్గా లేకపోవడం

  స్పాండిలోసిస్  లక్షణాలు:

దీర్ఘకాలికంగా తీవ్రమైన నొప్పి కలగడం, కండరాల బలహీనత మరియు కీళ్లలో దృఢత్వం ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే (రాత్రి నిష్క్రియాత్మకత తరువాత) ఎక్కువ నొప్పి ఉండటం, కీళ్లలో జలదరింపు లేదా  తిమ్మిరి మరియు ప్రభావిత ప్రాంతాల్లో సూదులతో కుచ్చిన భావన, సమన్వయ లోపం, నడక సమస్యలు, మరియు సయాటికా.

స్పాండిలోసిస్ కి హోమియోపతి చికిత్స

స్పాండిలోసిస్ కి హోమియోపతి అనేది సాధారణంగా ఎక్కువ మంది అనుసరించే చికిత్స. ఎందుకంటే హోమియోపతి చాలా ప్రభావవంతమైనది మరియు ఎలాంటి దుష్ప్రభావాలు లేనిది.

హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోని అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులు స్పాండిలోసిస్ వంటి ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి స్పాండిలోసిస్ లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడం కాకుండా సమస్య యొక్క మూల కారణ నిర్మూలనకు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స చేసారు. దీన్ని లక్షణాలు, తీవ్రత, జన్యు కారకాలు, మరియు స్పాండిలోసిస్ కి కారణమయ్యే ఇతర ఆరోగ్య పరిస్థితుల వంటి వ్యక్తిగత లక్షణాల ఆధారంగా అందిస్తారు. అయితే, దీని వల్ల ఇప్పటికే సంభవించిన నష్టాన్ని రివర్స్ చేయలేము కాని తదుపరి నష్టాన్ని నిరోధించడానికి హోమియోపతి చికిత్స ఎంతగానో సహాయపడుతుంది మరియు నొప్పి మాత్రలు లేకుండా లక్షణాల నుండి గొప్ప ఉపశమనం ఇస్తుంది.

మరింత సమాచారం కోసం  మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202  కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

స్పాండిలోసిస్ కి హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *