థైరాయిడ్
థైరాయిడ్ అనేది ముఖ్యమైన వినాళ గ్రంధుల్లో (ఎండోక్రైన్ గ్లాండ్స్) ఒకటి. ఇది సీతాకోక చిలుక ఆకారంలో కంఠం వద్ద ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్ ని విడుదల చేయడం ద్వారా శరీరంలో అనేక జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది.
థైరాయిడ్ సమస్యలలో తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడం (హైపోథారియిడిజం), అవసరమైన దాని కన్నా ఎక్కువగా థైరాయిడ్ విడుదల కావడం (హైపర్ థైరాయిడిజం), థైరాయిడ్ గ్రంధి వాపు/స్వెల్లింగ్ (గాయిటర్), థైరాయిడ్ ట్యూమర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం అనేవి చాలా ఎక్కువ మంది ప్రభావితం అయ్యే సమస్యలు. ఇవి శరీరంలో ఉండే కణజాలలకి వ్యతిరేకంగా అసాధారణంగా జరిగే రోగనిరోధక వ్యవస్త వల్ల వస్తాయి. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అని కూడా అంటారు.
థైరాయిడ్ సమస్యలకు కారణాలు
- అయోడిన్ లోపం,
- ఆటోఇమ్యూన్ వ్యాధులు,
- థైరాయిడ్ వాపు,
- జన్యు రుగ్మతలు,
- థైరాయిడ్ లోపల నోడ్యూల్స్,
- థైరాయిడ్ గ్రంధిని పాక్షికంగా తొలగించడం,
- పిట్యూటరీ గ్రంధి రుగ్మతలు,
- జీవన శైలి,
- అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు,
- ఒత్తిడి,
- శారీరక వ్యాయామం లేకపోవడం మరియు
- పోషకాహార లోపం .
పైన పేర్కొన్న అంశాలు వల్ల థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి
థైరాయిడ్ సమస్య యొక్క లక్షణాలు
హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు
- ఆకస్మికంగా బరువు పెరగడం,
- ఎక్కువ సేపు నీరసంగా అనిపించడం,
- చలిగా అనిపించడం,
- చర్మం పొడిబారిపోవడం,
- మలబద్దకం,
- జ్ఞాపక శక్తి తగ్గిపోవడం,
- ఏకాగ్రత లేకపోవడం
- స్త్రీలలో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ( అధిక రక్త స్రావం),
- స్త్రీలలో సంతానలేమి .
- పిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం,
- పిల్లల్లో ప్యూబర్టీ ఆలస్యం అవడం వంటి లక్షణాలు ఉండవచ్చు.
హైపర్‌థైరాయిడిజం యొక్క లక్షణాలు
- ఆకస్మికంగా బరువు తగ్గిపోవడం,
- వణుకు,
- ఆందోళనగా ఉండటం (యాంగ్జైటీ),
- వ్యాకులమై ఉండటం (నెర్వస్‌నెస్),
- దడ,
- విపరీతంగా చెమట పోయడం,
- మాటిమాటికీ మలవిసర్జన చేయవలసి రావడం
- పీరియడ్స్ లో బాగా తక్కువ రక్త స్రావం ఉంటాయి.
థైరాయిడ్ సమస్యలకు హోమియోపతి చికిత్స
హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో థైరాయిడ్ సమస్యలకు సురక్షితమైన, సమర్థవంతమైన మరియు దుష్ప్రభావాలు లేని హోమియోపతి చికిత్సను అందిస్తారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోని అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులు లక్షణాలు, కుటుంబ చరిత్ర, శారీరక మరియు మానసిక పరిస్థితుల విశ్లేషణ ఆధారంగా అన్ని థైరాయిడ్ సమస్యలకు కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్సను అందిస్తారు, ఇది లక్షణాలను తగ్గించడానికి మాత్రమే కాకుండా ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించకుండా సమస్యల మూల కారణాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కొన్నివేల మంది హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి చికిత్సతో థైరాయిడ్ సమస్యను నయం చేసుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
మరింత సమాచారం కోసం దయచేసి మా వెబ్‌సైట్ https://www.homeocare.in/thyroid-treatment.html పేజీని సందర్శించండి మరియు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202 కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.