సోరియాసిస్ కి హోమియోపతి చికిత్స

  సోరియాసిస్

సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక చర్మ వ్యాధి. అతి చురుకైన రోగనిరోధక వ్యవస్థ వల్ల చర్మంపై పొలుసులు, దురద, మరియు పొడి పాచెస్‌ను ఏర్పడటం జరుగుతుంది. ఇది సాధారణంగా ఎరుపు రంగులో ఏర్పడుతుంది, కానీ ముదురు చర్మపు రంగు ఉన్నవారిలో, ఇది ఊదా రంగులో ఉండవచ్చు. ఇది చిన్న మచ్చ నుండి పూర్తి శరీరం వ్యాపించే అంత తీవ్రత కల్గి ఉంటుంది. చర్మానికి సంబంధించిన ఈ పరిస్తితి 2-3 శాతం మందిని ప్రభావితం చేస్తుంది, ఇది స్త్రీ మరియు పురుషులు ఇద్దరిలో కనిపిస్తుంది మరియు పెద్దలలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఏ వయస్సువారిలోనైనా సంభవించవచ్చు.

సోరియాసిస్ కి హోమియోపతి చికిత్స

సోరియాసిస్ రకాలు:

      1. ప్లేక్ సోరియాసిస్ – ఇది తెల్లటి లేదా వెండి రంగు చర్మంతో కప్పబడిన ఎర్రటి ప్రాంతాలుగా కనిపించే అత్యంత సాధారణమైన సోరియాసిస్.     వీటిని సాధారణంగా మోచేయి, మోకాళ్లు, నెత్తిమీద మరియు వీపుపై కనిపించే ఫలకాలు(ప్లేక్స్) అంటారు.

  1. గట్టెట్ సోరియాసిస్ – చిన్న చిన్న బొట్టు ఆకారపు ఎరుపు లేదా గులాబీ రంగు పొలుసుల గాయాలు, ఇవి శరీరంలోని పెద్ద ప్రాంతాలలో ముఖ్యంగా ఛాతీ భాగము, ముంజేతులు, తల, వీపు భాగాలలో కనిపిస్తాయి. దీనికి తోడు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే చీముపొక్కులుగా మారుతాయి. ఈ రకమైన సొరియాసిస్ ఎక్కువగా యువకుల్లో  వస్తుంది.
  2. ఇన్వర్స్ సోరియాసిస్ – మృదువైన చర్మం వాచి, ఎర్రబడిన పాచెస్ వలె కనిపిస్తుంది, ఇది తరచుగా చర్మపు మడతలు, ముఖ్యంగా చంకలు, రొమ్ము కింద, జననేంద్రియ భాగాలలో, ఎక్కువ ఒత్తిడి, రాపిడి ఉండే ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది.
  3. పస్టులర్ సోరియాసిస్- చర్మంపైన ఏర్పడే మచ్చలలో అంటువ్యాధి లేని చీములాంటి ద్రవం ఏర్పడుతుంది. సాధారణంగా ఇవి చేతులు, కాళ్లపైన ఏర్పడతాయి.
  4. ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్ – ఇది తీవ్రమైన దురద, వాపు మరియు నొప్పితో సంబంధం ఉన్న చర్మం యొక్క విస్తృతమైన వాపు. ఇది ఎండలో తిరగడం, స్టెరాయిడ్ మందులు, యాంటిబయోటిక్స్ వాడడం వలన, కొన్ని ఎలర్జీల వలన కూడా ప్రేరేపితమవుతుంది.

 సోరియాసిస్ కారణాలు:

  • రోగనిరోధకశక్తిని బలహీనపరిచే జబ్బులు
  • అలెర్జీ కారకాలు
  • సూక్ష్మజీవులు
  • వేడి మరియు చల్లని ఉష్ణోగ్రతలు
  • ఆహారాలు
  • తీవ్రమైన మానసిక ఒత్తిడి
  • అధిక రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులు
  • మలేరియా నివారణకు ఇచ్చే మందుల వంటివి,
  • కొన్నిరకాల హార్మోన్లు
  • పొగతాగటం, 
  • అతిగా మద్యం సేవించే అలవాటు

 సోరియాసిస్ లక్షణాలు:

  • దద్దుర్లు
  • పొడి బారిన చర్మం
  • పుండ్లు పడడం
  • దురద,
  • పాచెస్ చుట్టూ మంట
  •  కీళ్ళ వాపు

సోరియాసిస్ బారిన పడిన వ్యక్తులకు మధుమేహం, ప్రకోప ప్రేగు వ్యాధి(IBS), సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

 సోరియాసిస్ కి హోమియోపతి చికిత్స:

హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సోరియాసిస్ చికిత్స కేవలం లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి మాత్రమే కాకుండా సోరియాసిస్‌ను నియంత్రించడానికి దాని మూలకారణానికి చికిత్స చేయబడుతుంది. సోరియాసిస్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్స తో ప్రజలు చాలా సంతృప్తి చెందారని ప్రజల అభిప్రాయం సూచిస్తుంది. ఇంకా,మా నిపుణులైన హోమియోపతి వైద్యులు రోగుల శారీరక మరియు మానసిక అంశాలను విశ్లేషించిన తర్వాతే సోరియాసిస్‌కు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి చికిత్సను అందించడం ద్వారా వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది.

మరింత సమాచారం కోసం  మా టోల్ ఫ్రీ నంబర్ 1800-102-2202  కి కాల్ చేయండి ,ఈరోజే మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.

సోరియాసిస్ కి హోమియోపతి చికిత్స

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *